ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 12:06 PM

నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి బాలిక ఘటన కలిచివేసిందని.. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు పాప ఆచూకీ దొరక లేదని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై ఆయన  స్పందిస్తూ.. దిశ చట్టాన్ని అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేసేశారన్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పడూ అండగా ఉంటుందన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 10 ల‌క్ష‌లు మంజూరు చేశార‌ని, ఆ చెక్కును ఇవాళ అంద‌జేసిన‌ట్లు కాట‌సాని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com