‘అధికారం లేకపోయినా వైయస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తలు దర్జాగా బతుకుతుంటే.. జనసేన జెండా మోసిన కార్యకర్తలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొడుతున్నారు. కాళ్లు పట్టిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావ్ పవన్’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. ఆదివారం వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారు. ఈరోజు వేధించే వాళ్ళకి 10 రేట్లు మేము తిరిగి ఇస్తాం.
నాలుగేళ్లకంటే ముందే...వాళ్ళకి చూపిస్తాం. అధికార మదంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. ఎంత కొట్టినా, తిట్టినా వైయస్ఆర్సీపీ జెండా మోయకుండా ఎవ్వరు ఆపలేరు. అది మా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే..అరెస్టులు చేస్తున్నారు. వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడదిలేదు. టీడీపీ సోషల్ మీడియాలా డబ్బులకు పని చేసేవాళ్ళు కాదు. వైయస్ జగన్ తల్లి, చెల్లెలి గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు తల్లికి, చెల్లికి ఆస్తులు రాసిచ్చారా?చంద్రబాబుకి ఎంత మంది చెల్లెలు ఉన్నారో ఎవరికైనా తెలుసా?తన చెల్లెళ్లకు చంద్రబాబు ఎంత ఆస్తి రాసిచ్చారు. వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చూసి ఎవరు ప్రేమించరు. వైయస్ జగన్ని ఓ హీరోగా, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రేమిస్తారు. సీట్లు చూసుకుని నోరు లేచేది పవన్ కళ్యాణ్ బ్యాచ్. మాకు ఎన్ని సీట్లు, ఉన్నా లేకపోయినా మేం పోరాడుతాం. మాకు అధికారం ఉన్నా, లేకపోయినా నోరు లేస్తుంది. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు నోరు లేపితే తాట తీస్తాడంట. నిన్ను నమ్ముకుని నీ జెండాలు మోసిన జనసేన కార్యకర్తల్ని కొడుతుంటే నువ్వేం చేశావ్ పవన్. జనసేన కార్యకర్తల్ని టీడీపీ వాళ్ళు కొడుతుంటే..ఏం చేశావ్?అధికారం లేకపోయినా వైయస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తలు దమ్ముగా బతుకుతున్నారు. పవన్ జెండా మోసిన..వాళ్ళు మాత్రం మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు. కొడుతున్నారు..కాళ్ళు పట్టిస్తున్నారు..ఎం చేస్తున్నావ్?పవన్ కళ్యాణ్ మా సంగతి తర్వాత. నిన్ను నమ్మినోళ్ళ సంగతి ముందు చూస్కో. మమ్మల్ని ఎంత వేధించినా ..మేము తగ్గేదే లేదు..నీకు చేతనైంది చేస్కో అని సవాల్ విసిరారు.