రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురంలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పవన్ పర్యటనను ఒకరోజుకే కుదించారు. పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే 5వ తేదీ నాగులచవితి కావడంతో పర్యటనను ఒక్కరోజుకే పరిమితం చేశారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఆయన 4న ఉదయం కాకినాడ జిల్లాకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం తిరిగి వెళ్లతారు.