రాజధాని అమరావతి పనులపై స్పష్టత కోసం సీఆర్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పునాదుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చెన్నై ఐఐటీతోపాటు వరంగల్ ఎన్ఐటీ, మరో రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని సీఆర్డీయే నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్‌లలో మౌలిక సదుపాయాలకల్పనపై కూడా ఒక నిర్ణయానికి రావాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధ్యాయనం చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది.