కదిరిలో వైసీపీ నేత షామీర్ భాషా కటకటాలపాయ్యాడు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన ఆరోపణలమీద నమోదైన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 301, దొంగపట్టాలు, 168 జిరాక్స్ దొంగ పట్టాలు, 32 పట్టాదారు పాస్ పుస్తకాలతోపాటు పది రకాల కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమీర్ భాషాను అనంతపురం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సహకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్తోపాటు మరో ఇద్దరు వైసీపీ నేతలు పరారీలో ఉన్నారు.