ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన మాట్లాడినదానిలో తప్పేమీలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 02:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పూ లేదని ఆమె అన్నారు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంతో మాట్లాడారో తెలుసని, త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని అనిత చెప్పుకొచ్చారు.


ఏపీలో శాంత్రిభద్రతల విషయమై సీఎం చంద్రబాబు, తాను పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఆ చర్చల్లో పవన్ కూడా భాగమేనని అన్నారు. ఉప ముఖ్యమంత్రికి అన్నీ విషయాలు తెలుసని, ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పూ లేదని అనిత చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com