అనపర్తి మండలం పులగుర్త వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో రావులపాలెం బయలు దేరింది. అనపర్తి మండలం పులగుర్త వచ్చేసరికి అదుపుతప్పి రామచంద్రపురం- మండపేట కెనాల్ వైపు బోల్తాపడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై ఆర్తనాదాలు చేశారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఉండటంతో బస్సు కాలువలోకి వెళ్లలేదు. దీంతో భారీ ప్రమాదం తప్పిం ది.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు స్పందించి 108కి సమాచారం అం దించి ప్రయాణికులను బయ టకు తీసుకు వచ్చారు. వీరిలో రాయవరం గ్రామానికి చెందిన బొడ్డు సూర్యకళ, తూరంగికి చెందిన కొప్పిశెట్టి ఆంజ నేయరాజు, కె.మల్లవరం గ్రామా నికి చెందిన నూకల వీరభద్రరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూర్యకళ తలకు బలమైన గాయం కావడంతో ఆమెను కాకినాడ ప్రభుత్వా సుపత్రికి పంపారు. బస్సు స్టీరింగ్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ తెలిపారు.