గుత్తిలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం బీఏ చదువుతున్న సానియా తైక్వాండో జాతీయ స్థాయి పోటీలకు బుధవారం ఎంపికైంది. దీంతో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి, సిబ్బంది ఘనంగా ఆమెను సన్మానించారు.
ఈ నెలలో గుంతకల్ పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో ప్రతిభ చాటి ఈనెల 11 నుంచి 15 వరకు పంజాబ్ లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో సానియా పాల్గొననుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa