ఈనెల 21 న జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తహశీల్దార్ సుదర్శన రాజు కోరారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఎంపీడీవో రామకృష్ణంరాజుతో కలిసి పాల్గొన్నారు.
మండలంలో 14 సంఘాలకు గాను ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పి వో, ఏ పీ వో తదితర ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇరిగేషన్ ఏ ఈ ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.