పశు సంవర్ధక, సహకార శాఖలలో నవంబరు 20 లోపల కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జేసీ సేతు మాధవన్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో 100 సంఘాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేశామని, సొసైటీలు ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ సభ్యులు వేయడం జరుగుతుందని అన్నారు. మార్చి 31 లోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.