గుంతలు లేని రహదారుల నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న 68 రహదారి మరమ్మతుల పనులన్నిటిని సోమవారంలోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబెడ్కర్ ఆదేశించారు.
జిల్లాలో 932 కిలో మీటర్ల రహదారి మరమ్మత్తుల పనులను జనవరి నాటికి పూర్తి చేయవలసి ఉన్నందున వెంటనే పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆర్ అండ్ బి అధికారులతో రహదారి మరమ్మత్తుల పనులపై ఆయన ఛాంబర్ లో సమీక్షించారు.