పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరలో వచ్చే ఏడాది జరిగే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శంబర పోలమాంబ జాతరకు సంబంధించిన తేదీలను ఈనెల 10న ఖరారు చేయనున్నట్లు శనివారం ఈఓ వివి సూర్యనారాయణ తెలిపారు.
దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక చెదురు గుడి వద్ద గ్రామ పెద్దలు, ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఈ తేదీలను నిర్ణయించనున్నట్లు చెప్పారు.