కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీసులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారి ఆనుకొని ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి పిఠాపురం సర్కిల్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించడమే కాకుండా, హెల్మెట్లు ధరించి నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు బహుమతులు అందజేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ఓ కొత్త రకం అవగాహన కల్పిస్తున్నారు.