రాజాం మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మయ్య పేట గిరిజన గ్రామంలో పాఠశాలను పునఃప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 10 సంవత్సరాల క్రితం విద్యార్థుల సంఖ్య 10 మందికి తక్కువ కావడంతో అధికారులు పాఠశాలను మూసివేశారు.
కానీ ప్రస్తుతం గ్రామంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాలను తిరిగి ప్రారంభించాలని వారు పేర్కొన్నారు. రాజాం వెళ్లి చదవడానికి ఆర్థిక భారం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.