గ్రామాల్లో ఎన్ఆన్ఇజిఎస్ పరిధిలో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మలాదేవి అధ్యక్షతన ఆదివారం.
మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజాప్రతినిధులు ఇచ్చిన తీర్మానాల మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నామని వివరించారు.