చేనేత రంగంలో మహిళలు రాణించాలని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి–విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(పీఐడబ్ల్యూఏ)ఆధ్వర్యంలో నూతన పద్మశాలీ భవన్‌ను నిర్మిస్తున్నారు.
పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు పీఐడబ్ల్యూఏ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేతలతో కలిసి మంత్రి లోకేష్ ఫొటోలు దిగారు.