జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువైయున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు.
ఆలయ కార్య నిర్వహణ అధికారి పి. ప్రభాకర్ రావు ఆయనకు దేవాదాయ శాఖ తరపున స్వాగతం పలికి ప్రత్యేక దైవదర్శనం కల్పించారు. ఆలయ ప్రత్యేక పూజలు అనంతరం ముఖ మండపంపై కలెక్టర్ కుటుంబ సభ్యులను అర్చకులు ఆశీర్వదించారు.