వేపాడ మండలం జాకేరు ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పి. బాల భాస్కరరావు మంగళవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, వంటగది, తరగతి గదుల నిర్వహణను పరిశీలించారు.
ఉపాధ్యాయుల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా మెనూ పాటించాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.