ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్ కరాటే పోటీల్లో కొత్తవలస మండలం వీరభద్రపురం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈనెల 9, 10 తేదీల్లో విశాఖలో ధరణి మెమోరియల్ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్ కరాటే పోటీల్లో.
ఈ గ్రామానికి చెందిన 25 మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో పాల్గొని పతకాలు సాధించినట్లు కోచ్ కే. రాజబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు హీరో సుమన్ చేతుల మీదుగా పతకాలు అందించినట్లు ఆయన తెలిపారు.