పాలకొండ మండలంలోని అట్టాలి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కనుములు సూర్య నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. తన గ్రామంలో అధికార పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేకే 18 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం పాలకొండ ఎంపీడీవో ఎమ్ రంగారావు, ఎపీఎమ్ ఈశ్వరమ్మలకు స్వయంగా తన రాజీనామా పత్రాన్ని అందజేసినట్లు సూర్యనారాయణ తెలిపారు.