ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత తమ్ముడితో మహిళ అక్రమ సంబంధం.. విషయం తెలిసి భర్త ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 10:12 PM

సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదు. కన్నూ మిన్నూ కానని కొందరు.. సొంత కుటుంబ సభ్యులు, రక్తం పంచుకుని పుట్టిన వారిని కూడా వదలడం లేదు. తల్లి, చెల్లి, అక్క, కుమార్తె అనే తేడా లేకుండా అఘాయిత్యాలు పాల్పడుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరికొందరు ఇద్దరి పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధాలు కొనసాగిస్తుండటం.. మరింత విమర్శలకు తావిస్తోంది. అయితే ఓ మహిళ తన తమ్ముడితో లైంగిక సంబంధాలు నెరపడం సంచలనం రేపుతోంది.


తాజాగా బయటికి వచ్చిన ఓ సంఘటన వింటేనే మనుషుల మధ్య సంబంధాలు ఇంతకు దిగజారిపోయాయా అని అనిపిస్తోంది. ఎందుకంటే.. ఓ మహిళ తన సొంత తమ్ముడితోనే లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు తెలియడంతో వారికి విడాకులు అయ్యాయి. కానీ ఇది ఒక్కరితో పరిమితం కాలేదు. ఆమె వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత అక్కాతమ్ముళ్ల వ్యవహారం వారికి తెలిసిపోవడంతో వారు విడాకులు తీసుకోవడం ఇలా జరుగుతూనే ఉంది. చివరికి ఐదో భర్త.. వారి మధ్య సంబంధం గురించి తెలుసుకుని.. ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆ గుట్టు బయటపడింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘోరం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఈనెల 7వ తేదీన ఆత్మహత్య చేసుకోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి జేబులో సూసైడ్ లెటర్ గుర్తించారు. అందులో ఉన్న విషయాలు చదివి వారు షాక్ అయ్యారు. ఆ మహిళకు అప్పటికే నలుగురితో పెళ్లి అయి విడాకులు అయినట్లు తేలింది. మరో షాకింగ్ వార్త ఏంటంటే వారంతా విడాకులు తీసుకోవడానికి, ఈ బాధితుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం.. ఆ మహిళ తన సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉండటమే అని తెలుసుకుని అవాక్కయ్యారు.


సూసైడ్ నోట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. బాధితుడు 2009లో ధోల్కాకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో అతడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ ధోల్కాలో నివసిస్తున్నారు. అయితే తన భార్య.. ఆమె తమ్ముడితో లైంగిక సంబంధం కలిగి ఉందని 3 నెలల క్రితమే బాధితుడు తెలుసుకున్నాడు. దీంతో ఒక రోజు తన ఇంట్లో భార్య, ఆమె సోదరుడు ఏకాంతంగా ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో వారిద్దరినీ కూర్చొబెట్టి నిలదీయగా.. భార్య, బావమరిది ఇద్దరూ కలిసి అతడ్ని తీవ్రంగా కొట్టడమే కాకుండా విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు.


అంతేకాకుండా తన భార్యకు గతంలో 4 పెళ్లిళ్లు అయ్యాయని బాధితుడు తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడ్ని ధోల్కాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ధోల్కా పోలీసులు తనకు ఫోన్ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. సమాచారం ఇచ్చినట్లు బాధితుడి తండ్రి తెలిపాడు. వెంటనే తాను ఆస్పత్రికి వెళ్లానని.. అప్పటికి తన కుమారుడు సగం స్పృహలో ఉన్నట్లు తెలిపాడు. అయితే తన భార్యతో గొడవ అయిందని.. అందుకే తాను విషయం తాగినట్లు తండ్రికి వివరించాడు. పరిస్థితి విషమిస్తుండటంతో అసర్వాలోని సివిల్ ఆస్పత్రికి తరలించగా.. అతడు ఈనెల 7వ తేదీన చనిపోయాడు. దీంతో బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుడి భార్య, ఆమె సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపైనా పోలీసులు కేసు నమోదు చేసి.. వారి కోసం దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com