ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవిరావుకి కీలక పదవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 08:25 PM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీవీజీఆర్‌ నాయుడు (గణబాబు), ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావులను ‘విప్‌’లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిరువురూ పార్టీ సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ/మండలి సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సి ఉంటుంది.


అలాగే ఏదైనా అంశంపై ఓటింగ్‌ ఉన్నప్పుడు తమకు కేటాయించిన సభ్యులు సభకు వచ్చేలా, కీలకమైన చర్చల్లో పాల్గొనేలా చూడాలి. గణబాబు 2014-2019 మధ్య కూడా విప్‌గా ఉన్నారు. చిరంజీవిరావు 2023 ఉత్తరాంధ్ర పట్టభద్ర నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. తమకు విప్‌గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు గణబాబు, చిరంజీవిరావులు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com