కూటమి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చిన హామీలకు తగట్టుగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ప్రతి పేద విద్యార్థిని సూపర్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలని వైయస్ జగన్ తప్పించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్‌తో తగిన కేటాయింపులు జరపలేదు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆక్షేపించారు.