చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది విఘాతం అని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అయన మాట్లాడుతూ.... కర్నూలులో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించే ప్రయత్నం దుర్మార్గం. వెనకబడిన ప్రాంతాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేయద్దు. ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలి. కర్నూలును వైయస్ జగన్ జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేశారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు చెప్పాయి. అభివృద్ది కేంద్రీకరణ జరిగితే విభజన సమస్యలు వస్తాయని స్పష్టంగా చెప్పారు. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానత ఏర్పడుతుంది.
రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదా?. చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో మొండిగా దుకెళ్తున్నారు. రాయలసీమకు మంజూరైన ప్రాజెక్ట్‌లన్నీ అమరావతికి తరలిస్తే ఎలా? చంద్రబాబుకు అమరావతి ధ్యాస తప్ప మరో ధ్యాస లేదా? రాయలసీమకు అన్యాయం చేయద్దు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇకనైనా రాష్ట్ర విభజన నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. ఇదే పరిస్ధితి కొనసాగితే రాయలసీమ మరింత వెనకబాటుకు గురవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా రాయలసీమ ప్రాంత నేతలంతా గొంతెత్తి నిలదీయాలి అని పిలుపునిచ్చారు.