మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని.. చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వైయస్ఆర్‌సీపీ హయాంలో రిసోర్స్ ఫండ్ 10,500 కోట్లు సాధించామని తెలిపారు. పయ్యావుల కేశవ్ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
కోవిడ్ సమయంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని జగన్ ఆపలేదు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించారు. రాష్ట్రాన్ని వైయస్ జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో జీడీపీ వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీ 4.83 శాతానికి వృద్ధి చెందింది.ఆనాడు చంద్రబాబు దాదాపు రూ.41 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను వైయస్ జగన్ కట్టారు అని కన్నబాబు వివరించారు.