ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు (శనివారం) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు మృతి చెందినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతికి ఏపీ మంత్రి నారాయణ సంతాపం తెలిపారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa