ఇ-కామర్స్ కంపెనీలు రెగ్యులర్‌గా వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై మంచి డీల్స్, డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. కొన్నిసార్లు స్పెషల్ సేల్స్ నిర్వహిస్తూ ఊహించని ఆఫర్లు అందిస్తుంటాయి.తాజాగా అమెజాన్ స్మార్ట్ టీవీలపై క్రేజీ డిస్కౌంట్లు అనౌన్స్ చేసింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్, సోనీ, LG, ఇతర టాప్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ లేటెస్ట్ సేల్‌లో అతి తక్కువ ధరకు లిస్ట్ అయిన బెస్ట్ ప్రీమియం స్మార్ట్ టీవీలు ఏవో చూద్దాం.
* శామ్‌సంగ్ 108 cm (43 ఇంచులు) D సిరీస్ క్రిస్టల్ 4K వివిడ్ అల్ట్రా HD స్మార్ట్ LED TV
అమెజాన్‌లో ఈ శామ్‌సంగ్ టీవీ ధర రూ.30,990. ఇది క్రిస్టల్ ప్రాసెసర్ 4K, HDR 10+ డిస్‌ప్లేతో వస్తుంది. 20W అవుట్‌పుట్, Q-సింఫనీ సౌండ్ సిస్టమ్, బిక్స్‌బై (Bixby) వాయిస్ రెడీ, యాపిల్ ఎయిర్‌ప్లే వంటి స్మార్ట్ ఫీచర్లు, UHD డిమ్మింగ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ వంటి స్పెసిఫికేషన్లు దీంట్లో ఉంటాయి. క్రిస్టల్ ప్రాసెసర్ 4K, వైబ్రెంట్ కలర్ డిస్‌ప్లే, ప్యూర్ కలర్ (PurColor), మోషన్ ఎక్స్‌లేటర్ (Motion Xcelerator), వాయిస్ కంట్రోలింగ్, IoT కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లతో ఈ టీవీ సినిమా లవర్స్, గేమర్స్‌కు మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
* ఎల్జీ 139 cm (55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ OLED TV
అమెజాన్ సేల్‌లో ఈ హై రేంజ్ టీవీ 36 శాతం డిస్కౌంట్‌తో, రూ.89,990కి లిస్ట్ అయింది. ఇది 55 అంగుళాల 4K OLED, డాల్బీవిజన్ IQ, HDR10 డిస్‌ప్లేతో వస్తుంది. 20W అవుట్‌పుట్, డాల్బీ అట్మోస్, AI సౌండ్ ప్రో సిస్టమ్‌తో సౌండ్ ఔట్‌పుట్ బాగుంటుంది. WebOS, AI ThinQ, బిల్ట్-ఇన్ అలెక్సా, యాపిల్ ఎయిర్‌ప్లే 2, గేమ్ ఆప్టిమైజర్, ఐ కంఫర్ట్ డిస్‌ప్లే వంటి వంటి స్మార్ట్ ఫీచర్లతో ఈ టీవీ రిలీజ్ అయింది.
* సోనీ 139 cm (55 ఇంచులు) బ్రేవియా టీవీ
అమెజాన్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ టీవీ రూ.57,990కి లిస్ట్ అయింది. 4K LED, 4K X-రియాలిటీ PRO, HDR10 డిస్‌ప్లే; 20W అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, ఓపెన్ బాఫిల్ స్పీకర్ సౌండ్ సిస్టమ్; గూగుల్ TV, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ ఫీచర్లు, మోషన్‌ఫ్లో XR 100, యాపిల్ ఎయిర్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లతో సోనీ బ్రేవియా టీవీ కస్టమర్లను ఇంప్రెస్ చేస్తోంది. ALLM, eARC ఫీచర్లతో గేమర్లు స్మూత్‌గా గేమ్స్ ఆడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ సర్వీస్‌లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
* Vu 126cm (50 అంగుళాలు) వైబ్ సిరీస్ QLED Google TV
ఈ స్మార్ట్‌టీవీ అమెజాన్‌లో రూ.34,490కి లిస్ట్ అయింది. ఇది క్వాంటం డాట్ టెక్నాలజీతో హై రేంజ్ 4K విజువల్స్, ఇంటిగ్రేటెడ్ 88W సౌండ్‌బార్‌తో క్వాలిటీ సౌండ్ ఔట్‌పుట్ అందిస్తుంది. మూవీ లవర్స్, గేమర్స్ అవసరాలకు ఇవి సెట్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇతర పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్‌ను టీవీలో యాక్సెస్ చేసుకోవచ్చు. 4K క్వాంటం డాట్ టెక్నాలజీ, HDR10+, HLG డిస్‌ప్లే; 88W సౌండ్‌బార్, డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్; గూగుల్ TV, ActiVoice రిమోట్ కంట్రోల్, ఇన్‌బిల్ట్ ActiVoice రిమోట్, AI పిక్చర్ ఇంజిన్, డైనమిక్ బ్యాక్‌లైట్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు దీంట్లో ఉంటాయి.
* MI 108 cm (43 అంగుళాలు) X సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ Google TV
అమెజాన్‌లో దీని ధర రూ.22,999. ఎంఐ కంపెనీ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ గూగుల్ TV వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌కు బెస్ట్ ఆప్షన్. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. 4K డాల్బీ విజన్, HDR 10 డిస్‌ప్లే; 30W అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, DTS వర్చువల్: X సౌండ్ సిస్టమ్, గూగుల్ TV, ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ స్మార్ట్ ఫీచర్లు దీని సొంతం.
* TCL 139 cm (55 ఇంచులు) మెటాలిక్ బెజెల్-లెస్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV 55V6B
ఈ ఫ్లాగ్‌షిప్ టీవీ ధర రూ.29,999. 4K రిజల్యూషన్, గూగుల్ టీవీ ఇంటిగ్రేషన్‌తో ఇది బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియర్స్ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. స్లిమ్ డిజైన్, డ్యుయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు దీని సొంతం. 4K UHD LED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో MS12Y, 24W అవుట్‌పుట్; గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ మిర్రరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa