విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతుండగా, మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.బాధితురాలిని ప్రేమ, పెళ్లి పేరుతో వంశీ దగ్గరై నమ్మించి మోసం చేశాడు. వంశీ ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి కూడా అత్యాచారం చేశాడు. ఈ ఘటన కలకలం రేపింది.బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ... గత ఆగస్ట్ 10న ఆమెను కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.