గత కొన్ని రోజులుగా దేశంలో టాటా కార్ల అమ్మకాలు తగ్గాయి. దీంతో కార్ల అమ్మకాల్లో 4వ స్థానానికి పడిపోయింది. రెండు నెలల క్రితం మహీంద్రా కార్లు 3 స్థానానికి ఎగబాకాయి.ఆ కంపెనీ నుంచి థార్ రాక్స్, స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. దీంతో దేశంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా అవతరించింది. ఒకానొక సమయంలో దేశంలోనే రెండో స్థానంలో కొనసాగిన టాటా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. అయితే సేఫ్టీలో నమ్మదగినవిగా టాటా కార్లు ఉన్నాయి. అందువల్ల వీటి సేల్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి క్లాసికల్ కారు మరోసారి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వంటి సెగ్మెంట్ కార్లను టాటా అందిస్తోంది. జనాలు ఎక్కువగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కొంటున్నారు. అయితే వీటి సేల్స్‌కి ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. దీంతో టాటా ఈవీ కార్ల అమ్మకాలకు కాస్త బ్రేక్ పడింది. మునుపటి వైభవం కోసం కొత్త మోడల్‌ని మార్కెట్‌లో తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
వచ్చే ఏడాది మార్చి నాటికి హారియర్ ఈవీని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఇప్పుడు పాత మోడల్ సియెర్రాను (Sierra) తిరిగి మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఒకప్పుడు ఈ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌ని శాసించింది. ఆఫ్-రోడర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది టాటా 207 ట్రక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. దీనిని అప్పట్లో విదేశీ మార్కెట్లకు సైతం ఎగుమతి చేశారు.
1991 నుంచి 2000 మధ్య కాలంలో ఈ కారు ఫేవరెట్‌గా ఉండేది. దీనికి ఉన్న క్రేజ్ వల్ల ఇప్పటికీ సియెర్రాకు ఫ్యాన్స్ ఉన్నారు. 2020 ఆటో ఎక్స్‌పోలో ఈ సియెర్రా కాన్సెప్ట్ వెర్షన్‌ని టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు దీనికి సంబంధించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో సియెర్రా తీసుకురానున్నట్లు టాటా మోటార్స్ ధృవీకరించింది.
అయితే దీని విడుదలపై కచ్చితమైన తేదీని కంపెనీ వెల్లడించలేదు. ముందుగా టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్ తర్వాత సియెర్రాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సియెర్రాను ICE ఇంజిన్ వెర్షన్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్వ్ కూపే ఎస్‌యూవీ సాధించిన విజయంతో సియెర్రా ఐసీఈ వెర్షన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.అయితే సియెర్రా ఏ ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం హారియర్ సఫారీలలో వినియోగిస్తున్న 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌తో సియెర్రా మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. ఎందుకంటే ఈ ఇంజిన్ ఫర్ఫామెన్స్ పరంగా 170 bhp వద్ద 350 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మంచి ఫర్ఫామెన్స్ అందించేందుకు ఈ ఇంజిన్‌తో సియెర్రాను తీసుకురానున్నారు.
మరోవైపు న్యూ 1.5 లీటర్ TDGi టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తోనూ సియెర్రాను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇది మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, బూస్ట్ ఫర్ఫామెన్స్ అందించడానికి ఉపయోగపడుతుంది. 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ సియెర్రా వెర్షన్‌ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఒకవేళ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తే 500 రేంజ్‌తో రానుంది. ప్రస్తుతం టాటా కార్లు అన్ని 500 కిమీ రేంజ్‌తో విడుదల అవుతున్నాయి.