అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు అని మాజీ సీఎం జగన్ వాపోయారు.అయన మాట్లాడుతూ...... ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై జీఎస్టీ మీద ఒక శాతం సర్‌చార్జ్ విధించి, ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా?
చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి దండ్రులెవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్లతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక.. వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్లిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డయినా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని సందేశమిచ్చారు.