ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు 9వ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగనుంది. రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్... విద్యుత్ చార్జీలు.. పుష్కర ఎత్తి పోతల పథకం... వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి.. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధులు.. ఆన్ లైన్ యాప్‌లు టిడ్ కో గృహాలు.... ఇమామ్‌లు మౌజన్‌లకు గౌరవ వేతనం... ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్... విశాఖలో ఐటి హబ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.ప్రశ్నోత్తరాల అనంతరం సభలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విధివిధానాలపై కేంద్రానికి పంపనున్న తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం పలు పాలసీలపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. డ్రోన్, క్రీడలు, టూరిజం, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ పాలసీలపై సంబంధిత శాఖల మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, నారా లోకేష్ ప్రకటన చేయనున్నారు.