గంజాయి అనేది ఓ వ్యాపారంగా వైసీపీ చేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఐదేళ్లు ఏపీ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కోరల్లో చిక్కుకుందన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదని.. అప్పటి హోంమంత్రి రివ్యూ కూడా పెట్టలేదని తెలిపారు. రాజమహేంద్ర వరం కూడా దానికి అతీతం కాదన్నారు. ‘‘ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయితో దొరికారని... మా ప్రాంతంలో ఉన్న రీజనల్ కోఆర్డనేటర్‌కు సంబంధాలు ఉన్నాయి’’ అని తెలిపారు. మీ భద్రత- మా బాధ్యత అని మహిళలతో, పోలీసులతో మీటింగ్‌లు నిర్వహించామని తెలిపారు. ఈ ఐదేళ్లలో 57 మందిపై గంజాయి కేసు పెట్టారని.. జైలుకు వెళుతున్నారు బయటకు వస్తున్నారన్నారు. ‘‘జైలులో గంజాయి పండించే వాడు. రవాణా చేసేవాడు, అమ్మేవాడు ఉంటున్నారు. వీరు అందరూ కలిసి వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇలాంటి వారిపై దృష్టి పెట్టాలి’’ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.