దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగనున్న ఆర్‌ఆర్‌బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-సికింద్రాబాద్, కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-కర్నూలు సిటీ, హుబ్లీ-కర్నూలు సిటీ, నాందేడ్-తిరుపతి, కారినాడటౌన్-తిరుపతి మధ్య రైళ్లు నడుపుతామని తెలిపారు.
నాందేడ్-తిరుపతి మధ్య 23న ప్రత్యేక రైలు(07105) నాందేడ్‌లో మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి ముడికేడ్, ధర్మాబాదు, నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్‌సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్డు, పాకాల స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతిలో ప్రత్యేక రైలు (07106) 24వ తేదీ మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు 8.35 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
కాకినాడటౌన్‌లో 23వ తేదీ ప్రత్యేక రైలు(07107) ఉదయం 6.30 గంటలకు బయలుదేరి సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూగుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా అదేరోజు సాయంత్రం 6.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతిలో 24వ తేదీ ప్రత్యేక రైలు(07108) రాత్రి 7.45 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలో ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాకినాడటౌన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 23, 24 తేదీలతో పాటు 26, 28, 29 తేదీలలో రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.