తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పదవుల్లో పశ్చిమకు ప్రాధాన్యం కొనసాగుతోంది. తాజాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్ని కయ్యారు. వివాదరహితులుగా పేరున్న వీరిద్దరిని ఈ పదవులకు ఎంపికచేశారు. రాష్ట్ర అసెంబ్లీల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో వీరు విజయం సాధించారు. భీమవరం నుంచి అంజిబాబు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పశ్చిమకు పదవి రావడం ఇదే తొలిసారి. కూటమి ప్రభుత్వంలో కీలక పదవులు పశ్చిమకు వరిస్తున్నాయి.
మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్, రెండు ప్రభుత్వ విప్‌లు, నాలుగు కార్పొ రేషన్ పదవులు జిల్లాకు దక్కాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా లోవున్న ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలకు పదవులు దక్కాయి. తాడేపల్లిగూడెం, నర్సాపురం ఎమ్మెల్యేలు బొలి శెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ ప్రభుత్వ విప్‌లుగా నియ మితులయ్యారు. తాజాగా అంజిబాబుకు మరో కీలక పద వి అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి వరిం చింది. ఇలా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో కీలక పదవులు జిల్లాకు దక్కాయి. అత్యధిక పదవులు వరించిన జిల్లాగా పశ్చిమ గుర్తింపుపొందింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆదాయ వ్యయా లను సరిచేసే కమిటీలో సభ్యులు కావడానికి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్, ఐటీ మంత్రి లోకేష్‌కు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.