వచ్చేనెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ సివిల్ కేసులు రాజీ చేయాలని శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం జిల్లా న్యాయవాదులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సివిల్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు.
అలాగే జిల్లాకేంద్ర కర్మాగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు శుక్రవారం సందర్శించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. జైలు న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల సలహాలు, సూచనలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.