వినుకొండ పాఠశాలలో అదనపు గదులను చీఫ్ విప్ జీవీ, మంత్రులు గొట్టిపాటి, డోలా శనివారం ప్రారంభించారు. ఎన్ఎస్పీ కాలనీలోని సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు ప్రారంభించారు. కార్యక్రమంలో పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట ఏంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నరసరావుపేట, మాచర్ల ఎమ్మెల్యేలు పొల్గొన్నారు.