తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తులు రూ.2.02 కోట్లు విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం ఈ భారీ విరాళాన్ని సమర్పించారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.