తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదలపై ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ ఫలితాలను 2025 ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేసే విధానాన్ని టీజీపీఎస్సీ కూడా అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విధానాన్ని గ్రూప్-1లో అమలు చేసి.. 2025 ఫిబ్రవరి నెలలోగా ఫైనల్ ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో ఇది వరకులాగే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది.