సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసభ్యకరమైన పదజాలంతో చెలరేగిపోయే ఉన్మాదులను చట్టపరంగా కట్టడి చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి. హెచ్చరించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
పురాణాల్లో రాక్షసుల మాదిరిగా సోషల్ మీడియాలో కూడా ఉన్మాదులు ఉన్నారన్నారు. అటువంటి వారు మహిళలు, వారి కుటుంబ సభ్యుల పట్ల అనాగరిక భాషలో చెలరేగిపోతున్నారని తెలిపారు.