అమర్తలూరు మండలం యలవర్రు గ్రామానికి చెందిన మల్లంపాటి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధికి మంజూరు చేసుకున్న నేపథ్యంలో శనివారం వేమూరులోని పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు అతనికి 30, 290 రూపాయలు సహాయనిది చెక్కును అందజేశారు.
ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.