మత్స్యకారులకు కేంద్రం నుంచి వచ్చిన పథ కాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉపయోగించుకుని మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. శాసనమండలి సమావేశాల్లో శనివారం ఎమ్మెల్సీ పద్మశ్రీ మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 100 తీరప్రాంత మత్స్యకార గ్రా మాలను అభివృద్ధి చేసుకునేందుకు మంజూరు చేశారన్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 15 మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ప్రతిపా దనలు వచ్చాయన్నారు. అయితే అమలాపు రం నుంచి ఓడలరేవు, మచిలీపట్నం నుంచి కిలతలదిండి, కాకినాడ జిల్లాలో ఉప్పాడ నుంచి కోనపాపపేట వరకు మత్స్యకార గ్రా మాలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఏఏ గ్రామాలను ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో పద్మశ్రీ వివరించారు.