అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజయవాడ వరదల నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాల గురించి చర్చించాలని కోరాను అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సోషల్ మీడియా అబ్యూజ్ గురించి పార్లమెంటులో చర్చించి, దాన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాలని కోరాను. ముస్లిం మైనారిటీల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించాం. ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనకార్యాలపై అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన చోట, అపకీర్తి మూటగట్టుకునే అంశాలపై రాష్ట్రం పేరు బయటికి రావడం బాధాకరం’’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.