అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) విద్యార్థులకు అందిస్తోందని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కార్యాలయ సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ డి.ఆర్.శర్మ తెలిపారు. ఇగ్నోలో నూతనంగా అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థులకు కోర్సు పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహించారు. ఇగ్నో సర్టిఫికెట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నవని, ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఇగ్నో దూరవిద్య కోర్సుల ద్వారా లబ్ధి పొందుతున్నారని శర్మ తెలిపారు. ఆరు మాసాలకు ఒకసారి అడ్మిషన్లు జరుగుతుంటాయన్నారు.
ఆన్‌లైన్‌లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇగ్నో ద్వారా 300లకు పైగా ప్రోగ్రామ్‌లు చేరువలో ఉన్నాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.ఎల్.రమేష్ తెలిపారు. ఇగ్నో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రసాద్‌బాబు, కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, కేబీఎన్ కళాశాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరావు, ఇగ్నో కో-ఆర్డినేటర్ ఎన్.సాంబశివరావు, ఇగ్నో అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ డి.పవన్‌కుమార్ పాల్గొన్నారు.