ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. పలు సమస్యలు, ఉపాధి అవకాశాల కోసం పలువురు వినతులు ఇచ్చారు.