నెల్లూరు నగర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు సాకేష్ పై తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు దాడికి పాల్పడటం అమానుషమని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. దాడి విషయం తెలిసిన వెంటనే నెల్లూరు నగరం, బాలాజీ నగర్ లో నివసిస్తున్న సాకేష్ ఇంటికి శాసనమండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కాకాణి వెళ్లి పరామర్శించారు. గాయాలను పరిశీలించి, దాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.