గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధికై రిజిస్టర్డ్ ఏజెంట్లు ద్వారా మాత్రమే వెళ్లాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్స్ ప్రతినిధులు ఎ.రవికుమార్, ఆర్.కృష్ణకుమార్ అన్నారు. విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి మోసపోతున్న వారిని అప్రమత్తం చేయ డానికి కొవ్వూరు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్స్ మిని స్ట్రీ ఆఫ్ ఎక్స్‌స్ట్రనల్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వ హించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. టూరిస్టు వీసాపై విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాల్లో చేరడం చట్టరీత్యా నేరమన్నారు. టూరిస్టు వీసా, వర్కు వీసాకు గల తేడాలను వివరించారు. రిజిష్టర్డ్ (లైసెన్సు కలిగిన) ఏజెంటు ద్వారా విదేశాలకు ఉద్యోగాలపై వెళ్లేవారికి విశాఖ, విజయవాడ, కాకినాడల్లో పీడీఓటీ (ఫ్రీ డిపార్చర్ ఒరియంటేషన్) శిక్షణ అందిం చడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో అత్యదికంగా ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. 2023లో 200 గ్రీవెన్స్ ఉండగా సుమారు 180 ఫిర్యాదులను పరిష్కరించామని ఇంకనూ 23 గ్రీవెన్సు మాత్ర మే ఉన్నాయన్నారు. విదేశాలకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రవాస భారతి బీమా యోజన పఽథ కాన్ని అమలు చేస్తుందన్నారు. విదేశాలకు వెళ్లే వారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఈఎంఐజీఆర్‌ఏటీఈ .జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో విదేశాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, లైసెన్సుడ్ ఏజెంట్లు వివరాలు పొందుపర్చడం జరుగుతుందన్నారు. వెబ్‌సైట్‌లో చూసుకుని భద్రత, రక్షణ చూసుకున్న తరువాత విదేశాలకు వెళ్లాలన్నారు. విదేశాలకు వెళ్లి మోసపోయి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే టోల్ ఫ్రీ నంబరు 1800 113090, ప్రవాస భారతి సహాయత కేంద్రం 01126885021, 040277 72557 నెంబర్లకు ఫిర్యాదు చేయాలనారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్, పట్టణ సీఐలు పి.విశ్వం, కె.విజయ్‌బాబు, సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు.