కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గొట్టివ లసలో గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం అమ్మకం చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్పాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎ.మధుసూదనరావు, పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.