అవసరమైన నీటి నిల్వలు లేకపోవడం వల్ల రబీ సీజన్‌లో సాగునీరివ్వలేమని వంశధార ఈఈ బి.శేఖరరావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గొట్టా బ్యారేజీలో ఆశించిన మేర నీటి నిల్వలు లేక పోవడం, ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో గొ ట్టాబ్యారేజీలో ప్రస్తుతం 500 క్యూసెక్కులకే పరిమితమైందన్నారు. దీనివల్ల రబీ సీజన్ లో పండించే వరి పంటలకు వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా సాగునీరం దించలేమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ను దృష్టిలో ఉంచుకొని కాలువ మరమ్మతుకు మంత్రి అచ్చెన్నాయుడు నిధులు మంజూరు చేయడంతో ఈ వేసవిలో పలు చోట్ల ఓటీలు మరమ్మ తులు చేపడతామన్నారు.
వంశధార ప్రధాన ఎడమ కాలువ పరిధి 55వ కిలోమీటరు నుంచి శివారు ప్రాంతమైన కిడిసింగి వరకు 104.250 కిలోమీటర్ వరకు, పెద్దసాన ఎస్కేప్, పోలవరం యాక్యులేటర్, ప్రొటక్షన్ వాల్, మదనగోపాలసాగరం ఔట్‌లెట్ రంధ్రాలు, 46ఆర్ తిర్లంగి, 49ఆర్ బన్నువాడ, 55ఆర్ కాపు తెంబూరు, 57ఆర్ పెంటూరు, 58ఆర్ నరేంద్రపురం, 60ఆర్ కణితివూరు, 61ఆర్ హరిదాసుపురం, 65ఆర్ కేసుపురం, 67, 68ఆర్‌లు ఈదుపురం తదితర ప్రాంతాల్లో ఓటీలకు ఈ వేసవిలో మరమ్మతులు చే యించాల్సి ఉందన్నారు. ఈ పనులకు టెండర్లను పిలి చామన్నారు. ప్రస్తుతం వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా 212 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని, కేవలం చెరువు ల్లోకి మాత్రమేనని గుర్తుచేశారు.