వాతావరణ నిపుణుల తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జెసి సేతు మాధవన్ హెచ్చరించారు. బుధవారం ఆయన గుర్ల మండలంలో పర్యటించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని సత్వరమే సాధ్యమైనంత వరకూ రైతు కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మండలంలో రైతు సేవా కేంద్రాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.