దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు.దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే పాఠశాల దగ్గరకు చేరుకుని.. స్టూడెంట్స్ ను, సిబ్బందిని బయటకు పంపించారు. ఆ తర్వాత బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సహాయంతో స్కూల్ ప్రాంగణంలో పూర్తిగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ దొరకలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారన చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, గురువారం నాడు ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో ఉన్న పీవీఆర్ మల్టీఫ్లెక్స్‌కు సమీపంలో బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పీవీఆర్ మల్టీఫ్లెక్స్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగిన ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంఘటన ప్రదేశంలో తెల్లటి పౌడర్ లభ్యం కాగా.. మరిన్ని వివరాల కోసం విచారన చేపట్టామని పోలీసులు చెప్పారు.